calender_icon.png 27 November, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న కుప్పను తగిలి వ్యక్తి మృతి

26-11-2025 11:11:21 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రోడ్డు పక్కనే ఆరబోసి కుప్పగా వేసుకున్న మొక్కజొన్న గమనించక స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి తగిలి అదుపుతప్పి కిందపడి మృతిచెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన మీసాల రాములు (40), మీసాల బాలస్వామి ఇరువురూ కల్వకుర్తి మండలం జాజాల గ్రామంలోని బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదంలో మీసాల రాములు అక్కడికక్కడే మృతిచెందగా బాలస్వామి స్వల్పంగా రాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతునట్లు తెలిపారు. మృతుడికి భార్య భారతమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు.