calender_icon.png 16 September, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజుల పాటు వర్షాలు

22-07-2024 10:07:27 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. రాయలసీమ జిల్లాలకు ఓ మోస్తరు వర్ష కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

శుక్ర, శనివారాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, మరింత వర్షం కురుస్తుందనే అంచనాతో పాఠశాలలు, కళాశాలల సెలవు ప్రకటిస్తే బాగుండు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి జోరు వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి షేక్‌పేటలో 12.3, లంగర్‌ హౌజ్‌లో 12, ​​గచ్చిబౌలిలో 9.8, మెహదీపట్నంలో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. రోడ్లను క్లియర్ చేయడానికి అత్యవసర బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి.