20-09-2025 12:06:05 AM
బాల్కొండ, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): గ్రామస్థాయిలో ఉల్లాష్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు, మహిళ వీఎవో ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘల పరిధిలో పలువురు మహిళలకు ఈరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పై సందర్భాన్ని పురస్క రించుకొని 11 గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి చదువుపై ఆసక్తి, అలాగే శ్రద్ధగా నేర్పించే కార్యక్రమమే ఉల్లాష్ కార్యక్రమం ఉద్దేశమన్నారు.
ప్రతి గ్రామైక్య సంఘాల పరిధిలో 30 మంది చొప్పున నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. యువతతో డిజిటల్ పద్ధతిలో చదువు నేర్పించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి నిరాక్షులైన మహిళలు సమయం కేటాయించుకొని చదువు నేర్చుకోవాలన్నారు. చదువు నేర్చుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడుతుందని, అందువల్ల ప్రతి ఒక్క నిరాక్షులైన మహిళలు వ్యక్తిగత శ్రద్ధతో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ వివిధ గ్రామాలలో జరుగుతున్నటువంటి శిక్షణ శిబిరాలను సందర్శించారు. వివిధ గ్రామాల, ప్రధానోపాధ్యాయులు, సిసిలు, విఒఎలు, గ్రామైక్య సంఘాల మహిళలు, సిబ్బంది ఇందులో పాల్గొన్నాలన్నారు. మండలంలోని ఎంఎంఎస్లో గ్రామైఖ్య సంఘాలకు నవభారత సాక్షరాస్యత పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ని వినియోగించుకోవాలని అన్నారు.
నిరక్షరాస్యులను డ్వాక్రా మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అమలు చేస్తున్న ఉల్లాస పథకం విజయవంతం చేసి మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి అన్నారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు మహిళలు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ఉద్దేశమని మండలంలో 2563 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, పదిమందికి ఒకరు చొప్పున వాలంటరు ద్వారా విద్యాభ్యాసం అందించనున్నట్లు ఆయన తెలిపారు.