calender_icon.png 20 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయాన్ని చరిత్రలో నిలిచేలా నిర్మించాలి

20-10-2025 12:00:00 AM

ముస్తాబాద్,అక్టోబర్ 19( విజయ క్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన సీనియర్ బిజెపి నాయకులు అన్నమనేని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూకాశీ, అయోధ్య, యా దాద్రి ఆలయాలను ఆయా ప్రభుత్వాలు భక్తి శ్రద్ధలతో చరిత్రలో నిలిచిపోయేలా కొన్ని తరాల వరకు భక్తుల సౌకర్యార్థం రాతి కట్టడాలుగా నిర్మించారని తెలిపారు.

కానీ రాజన్న ఆలయాన్ని మాత్రం సిమెంట్ పిల్లర్లు,ఇటుక కట్టడాలతో నిర్మించాలనుకోవడం దురదృష్టకరమని వెల్లడించారు. రాజన్న ఆలయాన్ని కూడా రాతి నిర్మాణాలతో తరతరాలు నిలిచే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా నిత్య పూజలు అందించాలని విజ్ఞప్తి చేశారు.