రాజన్న వార్షిక ఆదాయం 119.72 కోట్లు

23-04-2024 01:38:03 AM

రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ వార్షిక ఆదా యం రికార్డుస్థాయిలో సమకూరింది. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.119.72 కోట్ల నికర ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సంవత్సరం సమ్మక్క జాతర రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆదా యం పెరిగిందని తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.32.74 కోట్లు లభించింది. గత సమ్మక్క జాతర (21 సందర్భంగా ఆలయానికి వివిధ రూపాల్లో రూ.87.78 కో ట్లు ఆదాయం రాగా ఈసారి అదనంగా మరో రూ.31.94 కోట్లు అందాయి. 

ఆలయ ఆదాయ  వివరాలు (రూ. కోట్లలో)

కోడె టికెట్ల అమ్మకాల ద్వారా 22

ప్రసాదాల  ద్వారా 21.81

లీజులు, లైసెన్స్‌ల 15.50

వడ్డీల ద్వారా 5.55

ధర్మశాలలు 4.36

కల్యాణ టికెట్లు 3.55

అభిషేకాల టికెట్లు 2.79

శీఘ్రదర్శనం టికెట్లు 2.37

కేశఖండనం ద్వారా 2.13