calender_icon.png 7 August, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్ల్యూటీఐటీసీ విదేశీ కార్యదర్శిగా రామారావు

06-08-2025 01:49:26 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 5 (విజయక్రాంతి):అమెరికాకు చెందిన టెక్నాలజీ నిపుణుడు రామారావు దామా ఎన్‌ఆర్‌ఐను ప్రపంచ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) టెక్సాస్ విదేశీ సంయుక్త కార్యదర్శిగా నియమించినట్టు ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులతో సంబంధాలు మరింత బ లపరచడమే లక్ష్యంగా డబ్ల్యూటిఐటిసి తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలలో ఇది ఒకటి. 20 సంవత్సరాలకు పైగా ఓంకిల్; ఈఆర్; పి;టెక్నాలజీలలో ప్రావీణ్యంతో రామారావు వాణిజ్యం, ఫైనాన్షియల్స్, మానవవనరులు, సప్లు చైన్, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి అనేక రంగాల్లో మార్పులను నడిపించడంలో కీలక పాత్ర వహించారు.

దేశాల మధ్య అనుభవం మరియు రంగ నిపుణత్వం కలిగిన ఆయన డబ్ల్యూటిఐటిసి గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌కు గొప్ప ఆస్తిగా నిలవనున్నారు. ప్రస్తుతం లైఫ్ లైన్ ఫౌండేషన్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఇన్‌చార్జ్‌గా సేవలందిస్తున్నారు.

డబ్ల్యూటిఐటిసి చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ.. “ప్రపంచ తెలుగు ప్రతిభను ఏకం చేయడమే మా లక్ష్యం. రామారావు నియామకంతో డబ్ల్యూటిఐటిసి; చేపడుతున్న తెలుగు టెక్నోక్రాట్ల శక్తివంతీకరణ, గ్లోబల్ భాగస్వామ్యాల ఏర్పాటు, సరిహద్దులు దాటి నూతనతకు ఊతమివ్వాలనే దిశలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది” అన్నారు.