calender_icon.png 10 August, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటా కోసం కొట్లాట

06-08-2025 01:46:50 AM

  1. బీసీ రిజర్వేషన్ల సాధనకు ‘హస్తిన’లో సమరం
  2. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు జంతర్‌మంతర్‌లో కాంగ్రెస్ ధర్నా

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢి ల్లీకి చేరుకుంది. జితనీ ఆబాదీ.. ఇతనీ హిస్సేదారి (ఎంత జనాభాకు అంత వాటా) అనే రాహుల్‌గాంధీ నినాదాన్ని ఆచరణలో పె ట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పట్టువీడ కుండా ప్రయత్నం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు,- విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జంతర్‌మంతర్‌లో బుధవారం ధర్నా చేపట్టనున్నారు.

భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ర్టంలో కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవెర్చే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నారు. అధికా రంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టి.. ఆ లెక్కల ఆధారంగా రా ష్ర్టంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి ఆమోదముద్ర వేయించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

రాష్ర్ట శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు బీజేపీ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపారని అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జంతర్‌మంతర్‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో సీఎంతో పా టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైైర్మన్‌లు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన నున్నారు.

ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాష్ర్ట పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, వివిధ జిల్లాల నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రా హుల్‌గాంధీతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షా లు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల నాయకులు హాజరై తమ సంఘీ భావం తెలపనున్నారు.

పార్లమెంట్‌లో ఎంపీ చామల వాయిదా తీర్మానం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చారు. ‘తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచింది. ఆ బిల్లుకు అసెంబ్లీలో, క్యాబినెట్‌లో ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. అందువల్ల సభ ముందు ఇతర కార్యకలాపాలను వాయిదా వేస్తూ అత్యంత ప్రాముఖ్యత కలిగిన బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని లేవనెత్తగానికి తనకు అవకాశం ఇవ్వాలి’ అని స్పీకర్‌ను ఎంపీ చామల  కోరారు.