28-05-2025 12:00:00 AM
లక్షేట్టిపేట, మే27: లక్షేట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)గా రమణ మూర్తి బదిలీపై రానున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సీఐగా బాధ్యతలు నిర్వర్తించిన అల్లం నరేందర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీ స్ హైదరాబాద్‌కు, హైదరాబాద్‌లోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుం చి రమణ మూర్తిని లక్షేట్టిపేటకు బదిలీ చేసినట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (మల్టీ జోన్-1) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన సీఐ అల్లం నరేందర్‌కు పోలీస్ సిబ్బంది మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. సీఐ నరేందర్ సేవలు మరువలేనివని కొనియాడారు.