03-05-2025 04:56:36 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఎలుక చెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని మేఘ్య తండాకు చెందిన లూనావత్ సంజీవ ట్రాక్టర్లో తన పొలం నుండి గడ్డి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో విద్యుత్తు లైన్లు తాకి విద్యుదాఘాతంతో గడ్డి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం మరింత పెరగకుండా తగలబడుతున్న గడ్డి ట్రాక్టర్ ను గ్రామ పొలిమేరలోకి తీసుకువెళ్లి ఇంజన్ నుండి ట్రాక్టర్ ట్రాలీని విడగొట్టారు.