calender_icon.png 17 January, 2026 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముగ్గుల పోటీలు

17-01-2026 03:31:44 AM

ములకలపల్లి, జనవరి 16 (విజయక్రాంతి):ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టతోగు గ్రామంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి శుక్రవారం సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టతోగు గ్రామంలోని గ్రామ ముత్యాలమ్మ గుడి వద్ద పోటీలు నిర్వహించడం సం తోషకరం గా ఉందని ఆనందం వ్యక్తం చేసారు.

ప్రతి సంవత్సరం మహిళలకు ఇలాంటి పోటీలు పెట్టాలని ఆకాంక్షించారు.ఈ ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి కోండ్రు విజయలక్ష్మి, రెండొవ బహుమతి గడ్డం పార్వతి, మూడవ బహుమతి కోండ్రు స్వర్ణ గెలుపొందగా బహుమతులు సర్పంచ్ తుర్రం చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమం లో స్థానిక వార్డ్ మెంబర్ కోండ్రు వెంకటలక్ష్మి, సోడే కేశవరావు, మడకం సతీష్, బీ ఆర్ ఎస్ గ్రామ కమిటి నాయకులు గడ్డం సామెలు, గ్రామ పెద్దలు సున్నం కృష్ణ, కోండ్రు సత్యనారాయణ, కోండ్రు ధర్మరాజు, కోండ్రు రాందాస్ తదితరులు పాల్గొన్నారు.