17-01-2026 03:30:40 AM
దౌర్జన్యం కింద కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో కలకలం రేపిన ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్‌ను పోలీసులు అక్రమంగా అ రెస్టు చేశారని, ఇది ముమ్మాటికీ మీడియా స్వేచ్ఛను హరించడమేనని ఆరోపిస్తూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయిం చారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్.. మీడియా వ్యక్తులపై దౌర్జన్యం కింద కే సు నమోదు చేసింది. దీంతో ఈ కేసులో పో లీసుల తీరుపై జాతీయ స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
పోలీసులు చెబుతున్నట్లుగా తాను విచారణకు భయపడి పారిపోవడం లేదని స్పష్టం చేశారు.నాకు ఏమాత్రం సం బంధం లేని ఒక వార్తా కథనానికి, నాకు లిం కు పెడుతూ అరెస్టు చేశారు. దావోస్‌లో జరగనున్న వరల్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున వార్తల కవరేజీ కోసం, అలాగే వెకేషన్ ట్రిప్ కోసం నా భా ర్యతో కలిసి బ్యాంకాక్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్తున్నాను.అంతేకానీ పారిపోవడం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నన్ను అడ్డుకుని, అక్రమంగా నిర్బంధించారు అని రమేశ్ వివరించారు. విచారణ పేరుతో పోలీసులు తన ను మానసికంగా వేధించారని రమేశ్ ఆరోపించారు. తనకు అండగా నిలిచిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.