calender_icon.png 15 December, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరవేగంగా అభివృద్ధి పనులు

15-12-2025 05:27:37 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. 

మాదారంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. 

జిన్నారం/అమీన్ పూర్: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న యుజిడి పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, డిఈ నరసింహ రాజు, సీనియర్ నాయకులు, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు .