calender_icon.png 15 December, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఐటియు జెండా ఎగురవేయాలి

15-12-2025 05:24:30 PM

మర్రిగూడ (విజయక్రాంతి): అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నం నగరంలో ఈనెల 31న అదేవిధంగా జనవరి 1, 2, 3, 4 తేదీలలో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిఐటియు నాయకుల, కార్మికుల ఇండ్లపైన కార్మికుల, పని ప్రదేశంలో జెండా ఆవిష్కరణ చేయాలని ప్రచార కార్యక్రమంలో భాగంగా మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య తన ఇంటిపైన సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడుతామని, కార్పొరేట్ మతోన్మాద విధానాలను అవలంబిస్తూ కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేసి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగినట్టు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 22న తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్  జీవో కార్మికులకు వ్యతిరేకమైన జీవో కాబట్టి దాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్రం కంటే ముందు అనేక పోరాటాల ద్వారా తెచ్చుకున్న 29 కార్మికచట్టాలను రద్దు చేయడం వల్ల కార్మికులకు నష్టం జరిగే విధంగా ఉందని, వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు ఉన్నారు.