25-07-2025 01:17:07 AM
కొత్త రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్, జూలై 24 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజే స్తున్నదని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ, కళ్యాణ లక్ష్మి,షాది ముభారాక్ చెక్కులను అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం అం దించి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించి, మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ప్రభుత్వ దృడ సంకల్పాన్ని ముందుకు వెళుతోందన్నారు. ఎన్నో కార్యక్రమాలు, అభివృధ్ధి పనులు చేపడుతున్నదని అన్నారు.
రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు నమోదు చేయించుకోవాలని, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆన్నారు. ఎవరైనా చనిపోయిన లేదా రేషన్ కార్డులలో పేర్లు తప్పుగా నమోదై ఉం టే స్వచ్చందంగా వారి పేర్లు తీసివేయించాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ 10 సంవత్సరా ల నుండి ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల కల ఈ రోజు నెరవేరిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వీటన్నిటిని ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉట్నూర్ లో కొత్తగా సుమారు 3 వేల రేషన్ కార్డులలో 2,081 రేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు.
రేషన్ కార్డులు రానివారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం వెంటనే వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి వాజిద్, సం బంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.