25-07-2025 01:17:44 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన నిధులను విడుదల చేయాలంటూ రాష్ట్రానికి చెందిన మిడ్ డే మీల్స్ కా ర్మికులు గురువారం కేంద్రమంత్రులు ధ ర్మేంద్ర ప్రధాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి తమ సమస్యలు వి న్నవించుకున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన నిధులను కేంద్రం ఇప్పిటేక విడుదల చేసిందని ధర్మేంద్ర ప్రధాన్ వారికి చెప్పారు. రాష్ట్రంతో ఈ అంశంపై మాట్లాడి బిల్లులు చె ల్లించేలా చూస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. మిడ్ డే మీల్స్ కార్మికుల గౌరవ వే తనం రూ.17 వేలకు పెంచాలని ఈ సందర్భ ంగా వారు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేయగా.. ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు.