06-01-2026 01:02:29 AM
ఆదిలాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): నిత్యా జీవనశైలిలో వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం పట్టణంలోని బంగారు గూడ ఆదర్శ పాఠశాలలో జరిగిన ‘కాలమేఘం‘ కవిత సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పుస్తక రచయిత చిందం ఆశన్న రచించిన కాలమేఘం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ క్రార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లెపూల నర్సయ్య, డెయిరీ మాజీ చైర్మెన్ లోక భూమారెడ్డి, పలువురు రచయితలు నారాయణ, సంతోష్, బాలన్న, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.