03-01-2026 12:00:00 AM
చేవెళ్ల, జనవరి 2( విజయక్రాంతి): పల్లె పోరులో అధికార కాంగ్రెస్ కు అనుకున్నమేర ఫలితాలు రాలేదు.. 80శాతం గ్రామాలును చేజెక్కించు కోవాలని కాంగ్రెస్ భావించింది.. కానీ, ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు.. దీంతో పట్టణ ప్రాంతాల ఎన్నికల మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సైతం ఇదే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేసిన్నట్లు సమాచారం..
బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చి అవసరమైతే పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. మున్సిపల్ పోరుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నట్లు వినికిడి.. పురపాలికలపై పార్టీ జెండా ఎగరవేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అంతర్గతంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, పార్టీ ఎమ్మెల్యేకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్థానిక పోరు ముగియడంతో ఇక అందరిచూపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడింది.. అయితే, పల్లె పోరులో అధికార కాంగ్రెస్ కు అనుకున్న మేర ఫలితాలు రాలేదు..
80శాతం గ్రామాలను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావించింది.. కానీ, ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో పట్టణ ప్రాంతాల మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో గత నెల 28 నుంచి శీతకాల అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇందులో మొదట నీటిపారుదల, ప్రాజెక్టులు, రెండవ అంశంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, పురపాలిక పోరు పై చర్చించారు. మున్సిపాలిటీ పోరు పై నిర్ణయం తీసుకొనున్నారు బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చి అవసరమైతే పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. మున్సిపల్ పోరుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నట్లు వినికిడి.
ప్రస్తుతం పట్టణ ప్రాంత ప్రజలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నారని ప్రభుత్వం నిర్వహించిన పలు అంతర్గ త సర్వేల్లో వెల్లడైంది. అందుకోసం పురపాలక సంఘాలకు విరివిగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. చేవెళ్ల మున్సి పాలిటికి రెండు దఫాలుగా రూ. 30కోట్లు మంజురయ్యాయి. వీటితో మున్సిపల్ పరిధిలోని వార్డులలో పెద్దఎత్తున అందర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు వంటి పనులు పనులు చేస్తున్నారు. పట్టణ ప్రాంత ప్రజల ఓటర్లను ఆకట్టుకునేందుకు అసెంబ్లీ సాక్షిగా పలు తాయిలాలు ప్రకటించే అవకాశం లేకపోలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేల పైనే గెలుపు బాధ్యత పెట్టనున్నారు.
ప్రతిష్టాత్మకంగా పుర ఎన్నికలు...
కాకుండా మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా తీసుకునేందుకు సిద్ధమైంది. ఎలాగైనా పుర పాలికలపై జెండా ఎగరవేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఇన్ఫ్రార్జి మంత్రి, పార్టీ ఎమ్మెల్యేకు అదేశాలు జారీ చేసినట్లు సమాచారం అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో సమావేశం కానున్నారు.
అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడ ఏ సమయంలోనైనా మున్సిపల్ ఎన్నికలు రావచ్చని, సిద్ధంగా ఉండాలని ఇప్పటికీ పార్టీ క్యాడర్లకు దిశానిర్ధేశం వేసింది. పురపాలికంపై పట్టుకోసం కాంగ్రెస్, పొగావేసేం మకు బీఆర్‌ఎస్ తమ ప్రయత్నాలను మొదలు పెట్టాయి. కాగా మరోపక్క బీజేపీ సైతం పురపోరుకు సిద్ధమవు తున్నది.
పంచాయతీ ఎన్నికలు బీజేపీ పాగా..
గ్రామ పంచాయతీలలో అనుహ్యంగా 18 చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో బీజేపీ పాగా వేసింది. మున్సిపల్ సైతం అభ్యర్థులను నిలిపి కింగ్ మేకర్ కావాలని చూస్తుంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇంచార్జీ కెఎస్. రత్నం బీజేపీ శ్రేణులను ఆ దిశగా సిద్ధం చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి లు ఉన్నాయి.
చేవెళ్ల (18వార్డులు, 24,995 మంది ఓటర్లు), మొనాబాద్ (26 వార్డులు, 35,260), శంకర్పల్లి (15వార్డులు, 20,680) ఉన్నాయి. చేవెళ్ల మొయినాబాద్ లో కాంగ్రెస్ బలంగా ఉండగా, శంకర్ ల్లిలో మాత్రం బీఆర్‌ఎస్, బీజేపీ ల నుంచి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురుకావొచ్చు. అదేవిధంగా ఈ మూడు. మున్సిపాలిటీలలో ఎక్స్రేఫిషియో సభ్యులు (ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు)లు కీలకం కానున్నారు.
ఎన్నికల అనంతరం చైర్మన్ ఎన్నిక సమయంలో వీరు తమ పరిధిలోని ఏదో ఒక మున్సిపాలిటిలో ఓటు వేసేందకు అప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. హైద్రాబాద్ నగరంకు కూతవేటు దూరంలోనే ఉన్న మొయినాబాద్, శoకర్పల్లి, చేవెళ్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ భూములు ధర చైతం ఎకరం కోట్ల రూపాయాలు పలుపగా కౌన్సిలర్లు, చైర్మెన్ అభ్యర్థులుగా రియల్ వ్యాపా రం చేస్తూ. రాజకీయాల్లో ఉన్నవారే.
కనుక ఎన్నికల ఖర్చుపైతం కోట్ల రూపాయాలు ఉంటుందనటంలో సందేహం లేదు. ఒక్కొక్క అభ్యర్థి(కాంగ్రెస్, డీఆర్‌ఎస్) రూ. 25 నుంచి 30 కోట్లు పెట్టుకునేందుకు సిద్ధమైన్నట్లు వినికిడి. ప్రభుత్వం, నేతలు పుర పోరుకు సన్నద్ధ మవు తున్నారనేది నిజం. అన్నీ పార్టీల బలాబలాలు, కొత్తగా ఏర్పడినచేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీ ల పరిధిలో కొత్త నాయకత్వం రెడీ అవుతుంది.
ఎన్నికల్లో రియల్ ప్రభావం..
మూడు మున్సిపాలిటీలో రియల్ వ్యాపారం, భూముల ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ అన్నీoటిల్లో కాంగ్రెస్ పార్టీది ఫై చెయ్ గా నిలువనుంది. బీజేపీ, బీ ఆర్ ఎస్ కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపనుంది.రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 10న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నారు.