calender_icon.png 2 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ

01-05-2025 10:53:37 PM

కామారెడ్డి (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఈనెల మే7 తేదీన మొదటి డ్యూటీ నుండి జరుగు సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ వెంకట గౌడ్ మాట్లాడుతూ... ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలియం చేయాలని, ట్రేడ్ యూనియన్ లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, కొత్త అలవెన్స్లు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 2017 వేతన సవరణ జరిగి అన్ని బకాయిలు చెల్లించాలని, 2021,2025 వేతన సవరణలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బందిపై అధిక పని భారాలు తగ్గించాలని, ఎంటి డబ్ల్యూ యాక్టును అమలు చేయాలనీ, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కారణంగా నిరపారాదులైన డ్రైవర్లను శిక్షించరాదని, వారిని వైద్య పరీక్షలకు పంపాలని, మహాలక్ష్మి పథకం అమలు జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించరాదని అన్నారు.

ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం ప్రభుత్వం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కొని ఆర్టీసీకి ఇవ్వాలని, కారుణ్య నియామకాలు  రెగ్యులర్ ప్రతిపాదన కింద పని చేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని అదే బస్సుల మరియు ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లను ఇతర సిబ్బందిని ఆర్టీసీలోనికి తీసుకోవాలని 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తివేయాలని, పిఎఫ్, సిసిఎస్ నుండి యజమాన్యం వాడుకున్న డబ్బులను వాటితో సహా చెల్లించాలని, ఔట్సోర్సింగ్ మరియు కాంటాక్ట్ల పేరు మీద పనిచేస్తున్న అధికారులను సూపర్వైజర్లను తొలగించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్ మూర్తి, బాలాగౌడ్, శేఖర్ ,ప్రేమ్ కుమార్, గిరి, బుచ్చిరెడ్డి, అంజయ్య, శ్యామ్, డిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.