30-10-2025 01:36:07 AM
							కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): బ్రేయిన్ స్ట్రోక్‌ను సకాలంలో గుర్తిస్తే సులభంగా రికవరీ చేయవ చ్చని మెడికవర్ వైద్యులు వెల్లడించారు. వరల్డ్ బ్రేయిన్ స్ట్రోక్ డేను పురస్కరించుకొని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. వంశపారంపర్యం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్థూలకా యం, ఆల్కహాల్, పొగత్రాగడం, గుండె సమస్యలతో బ్రేయిన్ స్ట్రోక్ ప్రమా దం ఉంటుం దన్నారు.
కాళ్లు, చేతులు పడిపోయి, మూతి వంకరపోయిన తర్వాత ఆసు పత్రికి రావడం వల్ల రికవరీలో జాప్యం జరుగుతుందని తెలిపారు. స్ట్రోక్‌కు గురైన 4 గంటల లోపు అం టే గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తీసుకువస్తే థ్రాంబోలైసిస్ అనే ఇంజక్షన్‌ను వేసి రికవరీ చేయడం, ఆలస్యమైతే లక్షణాలను బట్టి సర్జికల్ క్లిప్పింగ్, ఎండోవాస్కులర్ థెరపీ, కాయిలింగ్, ప్రోడైవర్టర్లు, ఆర్టిరియోవెనస్ మాల్ ఫార్మేషన్, డీ కమోప్రెసివి క్రానియోటమి శస్త్రచికిత్స విధానాల ద్వారా రికవరీ చేయవచ్చని వెల్లడించారు.
ఆసుపత్రి సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్, మెడికల్‌హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుమన్, మెడికవర్ ఆసుపత్రి ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్టు డాక్టర్ సంజయ్ కమిన్వర్, న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి శ్రీకాంత్, మనోజ్, అధిక సంఖ్యలో నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.