30-10-2025 01:37:22 AM
ఎంబీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశలో వక్తలు
ముషీరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిసిలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బిసి, ఎంబిసి, డిఎస్టి సంఘాలు ఐక్య కార్యాచరణతో ఉద్యమాన్ని ఉదృతం చెయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఎంబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోగికార్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరెకటిక పోరాట సమితి, అఖిల భారత విశ్వకర్మ పరిషత్, విశ్వకర్మ హక్కుల సాధన సమితి, డినోటిఫయిడ్ ట్రైబస్(డిఎన్ టి), తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, వంశరాజ్, రజక, తెలంగాణ మాదిగ దండోరా, బహుజన ముక్తి పార్టీ, నాయి బ్రాహ్మణ సంఘం, కార్మిక హక్కుల పోరాట సమితి, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సామాజిక తెలంగాణ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. దశబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి నిరాదరణ గురై, రిజర్వేషన్ ఫలితాలు అందుకోలేని స్థితిలో మైనారిటీ వెనకబడిన కులాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మోహన్ బైరాగి, చింతాస్వామి, మన్నారం నాగరాజు, వేణుగోపాల్, సత్తార్, జావీద్, ప్రఫుల్ రామ్ రెడ్డి, వీరాచారి, వేణుగోపాల్ చారీ, సోమాచారి, వెంకటాచారి, ప్రభాకర్ తదితరుల పాల్గొన్నారు.