21-05-2025 01:11:20 AM
ఆర్మూర్ రకం వంగడానికి డిమాండ్, జిల్లాలో 40 శాతానికి పైగా సాగు
నిజామాబాద్, మే 20 (విజయ క్రాంతి): ఎర్రగుంటూరు ఆర్మూర్ రకం నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులోకి వచ్చే పసుపు రకాల లో 99 శాతం ఉంటుంది. నిజామాబాద్ పసుపు యార్డు కనుగోలలో రాష్ట్రంలో నే 70 శాతం వాటా కలిగిన నిజామాబాద్ మార్కెట్ యార్డుకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పసుపు వ్యాపారంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ కమ్మర్పల్లి మోర్తాడ్ బాల్కొండ వేల్పూర్ లక్కోరా జిల్లా కేంద్రాలతో పాటు వివిధ మండలలలో అత్యధికంగా పసుపు రైతులు ఎర్రగుంటూరు ఆర్మూరు, రకం పొంగడాన్ని సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల ఎరుపు రకం పసుపు వంగడాన్ని నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి పరిశోధన కేంద్రంలో మరింత అభివృద్ధి పరిచి అధిక దిగుబడిని ఇచ్చే విధంగా తీర్చిదిద్దారు.
ఆనాటి నుండి ఈ పసుపు వంగడానికి ఎర్రగుంటూరు (ఆర్మూరు రకం) గా నామకరణం చేశారు ఎర్రగుంటూరు రకం వంగడం ఇక్కడి వ్యవసాయ పంట భూముల నేలకు అనువుగా ఉండి మంచి దిగుబడినిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈ పసుపు పంట చేతికి వచ్చిన తర్వాత కర్క్యూమిన్ మూడు శాతం లోపే అతి తక్కువగా ఉండడంతో కర్క్యుమిన్ ఎక్కువ శాతం ఉండే పీతాంబర్ ఉత్తర ప్రదేశ్ సోనాలి రాజేంద్ర సోనాలి బీహార్ రకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినప్పటికిని...
ఆ వంగడాలను అతి తక్కువగా సాగుచేస్తూ నిజామాబాద్ రైతులు స్థానిక కమ్మర్పల్లిలోని పసుపు పరిశోధన కేంద్రంలో అభివృద్ధి పరిచిన ఎర్రగుంటూరు ఆర్మూర్ రకం పంట వైపే పసుపు రైతులు ముగ్గు చూపుతున్నారు కేవలం ఆరు నెలల్లోనే పంట చేతికి వచ్చే ప్రగతి ప్రతిభ కేరళకు చెందిన పొట్టి రకం పంటను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికిని పసుపు తూకంలో తక్కువ రావడం బరువు తక్కువగా ఉండటం వల్ల రైతులు ఆ పంటలపై ఆసక్తి చూపడం లేదు.
ఎర్రగుంటూరు ఆర్మూర్ రకం అధిక దిగుబడితోపాటు ఆరు నెలల్లో పంట చేతికి వస్తూ తూకం లో బరువు ఎక్కువగా ఉండటంతో రైతులు ఈ పంట పైన ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఎర్రగుంటూరు రకమే దుంప పంట వేస్తున్నారు. ఎక్కువగా వచ్చే తమిళనాడు సేలం రకం పొంగడాన్ని సైతం నమోదంగా నే సాగు చేస్తూ న్నారు.
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సాగు అయ్యే రాజ ఉరి సేలం పితాంబరం రకాలను రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సంఘీ మార్కెట్ కు తరలిస్తూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు ఈ రకాల్లో శాతం ఎక్కువగా ఉండటం వల్ల పంట తూకం తక్కువగా రావడం వల్ల రైతులు ఈ వంగడాలపై ఆసక్తి చూపడం లేదు. పైగా ఎర్రగుంటూరు ఆర్మూరు రకం పసుపును ప్రజలు ఎక్కువగా వాడుతూ ఉండడంతో నిజామాబాద్ పసుపు ఇరాన్ బంగ్లాదేశ్ తో పాటు అరబు దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోంది.
వివిధ రకాల పసుపు పంటలపై పరిశోధన
కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వన విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లో నడుస్తున్న కమ్మర్ పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో పరిశోధనలకు భారత సుగంధ ద్రవ్యాల పసుపు బోర్డు సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పుసైస్ రీసెర్చ్ సెంటర్ నుంచి పలు సూచనలు తీసుకుం టూ కేరళలోని ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టు ఇన్ స్పుసైస్ ఏఐసిఆర్పి తో సమన్వయ పరుచు కుంటూ పరిశోధనలు కొనసాగిస్తున్నారు గుంటూరు నుంచి తెచ్చిన ఎర్ర పసుపు వంగడాన్ని కమ్మర్పల్లి లో మరింత అభి వృద్ధి పరిచారు.
అప్పటినుండి ‘ఎర్ర గుం టూరు‘ ఆర్మూర్ రకం గా ఈ వంగడం పిలువబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో 15 కు పైగా వివిధ రకాల పొంగ డాలపై పరిశోధనలు జరుపుతున్నారు. అధిక కర్క్యూమిన్ దిగుబడి ఎక్కువగా తెగుళ్ళ నివారణ కీటకా ల నుండి రక్షించుకోవడం పురుగు నివారణ తదితర అంశాలను దృ ష్టిలో పెట్టుకొని పసుపు పొంగడాలను పటిష్ట పరచడానికి పరిశోధనలు కొనసాగు తూనే ఉన్నాయి.
అత్యధికంగా నిజామాబాదులోనే సాగు
అత్యధికంగా 40 శాతం నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగవుతుండగా కరీంనగర్ సంగారెడ్డి పెద్దపల్లి ఆదిలాబాద్ భూపా లపల్లి హనుమకొండ మహబూబాబాద్ వికారాబాద్ వరంగల్ జగిత్యాల నిర్మల్ తదితర జిల్లాల్లో రైతులు పసుపు పంట సాగు చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ కు 2019 -20 సంవత్సరంలో క్వింటాళ్ల పసుపు నువ్వు రైతులు మార్కెట్ యార్డ్ తెచ్చారు అదేవిధంగా 20 20 - 21 లో పసుపు రైతులు 8.55.516. క్వింటాళ్ల పసుపుతేగా 2021- 22 సంవత్సరంలో 8.37.932 క్వింటాళ్ల పసుపు పంట మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చారు.
2022-23 సంవత్సరంలో 7.49.072 క్వింటాళ్ల పసుపు మార్కెట్ యార్డ్ కు రైతుల తీగ 2023-24 సంవత్సరంలో 7.23.470. క్వింటాళ్ల పసుపు పండించి న రైతులు మార్కెటింగ్ తెచ్చారు. గత సంవత్సరం మార్కెట్ యార్డుకు వచ్చిన పసుపు పంట కంటే ఈ ఏడు 1.50(ఒక లక్ష 50 వేల ) క్వింటాళ్ల పసుపు అధికంగా మార్కెట్కు రానున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ నెలాఖరు వరకు మరో 60 వేల కిట్టాల పసుపు ఏప్రిల్ లో 85 వేల క్వింటాళ్ల మేరకు మే నెలలో 85 వేల క్వింటాళ్ల పసుపు ఇక్కడి మార్కెట్ యార్డ్ కు రానున్నట్టు అధికారులు తెలిపారు ఈ సంవత్సరం ఎకరానికి 31 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా ఒక నిజామాబాద్ జిల్లాలోనే 22వేల ఎకరాల్లో పసుపు సాగు జరిగినట్లు అధికారులు తెలిపారు.