21-05-2025 10:42:31 PM
కోదాడ: టీజీ ఆర్ జెసి ఫలితాలలో జయ పాఠశాల ప్రభంజనం సృష్టించిందని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినినీ అభినందిస్తూ మాట్లాడారు. ఈ నెల 10న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టీజీ ఆర్ జె సి పరీక్షలో కోదాడ జయ పాఠశాలకు చెందిన ఇఫ్రా తస్నీమ్ రాష్ట్ర స్థాయిలో 150 మార్కులకు గాను 138 మార్కులు సాధించి 4వ ర్యాంకు సాధించింది. ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలోని 301 కేంద్రాలలో నిర్వహించారు. ఇంతటి ఘనత సాధించిన తమ విద్యార్థిని విజయానికి సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని, తల్లిదండ్రులను పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మలు ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.