బోధన్ ఎమ్మెల్యేను కలిసిన రెడ్డికా సంఘ నాయకులు
ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ రెడ్డికా నాయకులు
బోధన్, జూన్15 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 10 ద్వారా ‘రెడ్డికా’ కులానికి అధికారికంగా డీఎన్టీ గుర్తింపు దక్కడం పట్ల నిజామాబాద్ జిల్లా రెడ్డికా సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
దశాబ్దాల కలను సాకారం చేస్తూ, తమ కుల అస్తిత్వాన్ని నిలబెట్టిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డికా సంఘం నాయకులు గుమ్ముల అశోక్ రెడ్డి బోధన్, పాడ్దే రాజు రెంజల్, కొట్టాల ప్రవీణ్ కుమార్ ,నవీపేట్, సూర అబ్బారెడ్డి మోస్ర, పిట్ల సాయన్న జానకంపేట్, పట్నం రవి బోధన్, పంతులు అరుణ్ నిజామాబాద్, ఎర్గం ప్రకాష్ నిజామాబాద్ తదితరులు పాల్గొన్నారు.






