calender_icon.png 29 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్డి జాగృతి పిటిషన్‌ను విరమించుకోవాలి

29-09-2025 12:56:01 AM

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలో 60 శాతం జనా భాను కలిగిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వ ఆర్డర్ను హైకోర్టులో సవాలు చేసిన రెడ్డి జాగృతి పిటిషన్ను వెంటనే విరమించుకోవాలని  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలకు, రెడ్డి సమాజం సహకరించకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆదివారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్స్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ తెలంగాణలో బీసీలు ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, రెడ్డి జాగృతి చెం దిన వారు బీసీలపై కుట్రలు చేస్తూ వారికి దక్కాల్సిన హక్కులను దక్కడంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు. 

బీసీలపై రెడ్డి సామాజిక వర్గానికి చిత్తశుద్ధి ఉంటే, రెడ్డి జాగృతి నాయకులను ఒప్పించి పిటిషన్ను ఉపసంహరించుకునేలా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జెల్ల నరేందర్,  మరపంగు వెంకన్న కర్నాటి లోకేష్, డేగల రమ,  పూస యమున రాణి,  వరలక్ష్మి పాల్గొన్నారు.