12-10-2025 02:23:53 AM
కోల్‌కతా, అక్టోబర్ 11: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి మరువకముందే తాజాగా దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో మరో ఘటన చోటుచేసుకున్నది. ఎంబీబీస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగికదాడి జరిగింది. ఈ ఘ టన శనివారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన ఓ యువతి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఎంబీబీ ఎస్ సెకండియర్ చదువుతున్నది. శుక్రవా రం రాత్రి ఆమె స్నాక్స్ తినేందుకు తన స్నేహితుడితో కలిసి కాలేజీ నుంచి బయటకు వెళ్లింది. వారిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా దుండగుల మూక గమనించింది. విద్యార్థినితో ఉన్న స్నేహితుడిపై దుండగులు దాడి చేశారు.
విద్యార్థిని చేతిలోని మొబైల్‌ను లాక్కుని విసిరేశారు. అనంతరం నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలి స్నేహితుడు క్యాంపస్‌లోకి వచ్చి యాజమాన్యానికి, విద్యార్థులకు విష యం వివరించాడు. దీంతో సిబ్బంది, విద్యార్థులు ఆమె కోసం గాలించారు. ఓ నిర్మాను ష ప్రాంతంలో బాధితురాలిని గుర్తించి స్థాని క ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స మాచారం అందుకున్న బాధితురాలి తల్లిండ్రులు హుటాహుటిన దుర్గాపూర్‌కు చేరుకు న్నారు. విద్యార్థులపై యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఘటన సంభవించిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించా రు. తాము ఆసుపత్రికి చేరుకున్న సమయం లో కుమార్తె అస్వస్థతతో ఉందని, ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు సరైన వైద్యం అం దించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనపై దుర్గాపుర్ న్యూ టౌన్‌షిప్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మెడికల్ కాలేజీ సిబ్బందిని, బాధితురాలితో పాటు క్యాంపస్ బయటకు వెళ్లిన స్నేహితుడిని, పలువురు అనుమానితులను ప్రశ్నిస్తు న్నారు. మరోవైపు లైంగికదాడి ఘటనపై మెడికల్ కాలేజీ నుంచి అక్కడి ప్రభుత్వం నివేదిక కోరింది.
లైంగికదాడి ఘటనపై ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి షశి పంజా మాట్లాడుతూ.. బాధితురాలు ప్రస్తు తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, వైద్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఆ రాష్ట్ర మహిళా కమిష న్ బృందం దుర్గాపుర్‌కు వెళ్లి బాధితురాలు, ఆమె తల్లిదండ్రులను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మహమీజ్ ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ.. లైంగికదాడి ఘటనపై బెంగాల్ ప్రభుత్వం తక్షణం స్పందించా లని సీఎం మమతా బెనర్జీని కోరారు. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ రాష్ట్ర బీజే పీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో పదే పదే లైంగికదాడులు జరగడం బాధాకరం. రాష్ట్రం లో మహిళల భద్రత అంశాన్ని సీఎం మమ తా బెనర్జీ పట్టించుకోకపోవడం వల్లే వరుసగా ఘటనలు సంభవిస్తున్నాయి’ అని ఆరోపించారు.