03-09-2025 12:15:18 AM
యోచిస్తున్న అధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖలో ఇక నుంచి రెగ్యులర్‌గా ప్రమోషన్లు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలి స్తున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల ప్రమో షన్లకు ఏడాది, రెండేళ్లు, ఆపై సమయం తీసుకో కుండా నెల నెలా ప్రమోషన్లు ఇస్తే ఎలా ఉంటుందోనని అధికారులు యోచిస్తున్నారు. పదవీ విరమణ పొందిన వెంటనే అర్హులైన వారికి సీనియారిటీని బట్టి పదోన్నతులు ఇవ్వాలని అనుకుంటున్నారు.
ప్రమోషన్లు పొందేవారు ప్రతి నెలా పదుల సంఖ్యలోనే ఉంటారు. ఇలా ఇస్తే పెద్దగా సమస్య ఉండదని, అయితే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే దాదాపు ఐదు వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే.