23-05-2025 01:59:30 AM
జేకేఓసీ పనులు అడ్డుకుంటామని హెచ్చరించిన అఖిలపక్షం
ఇల్లెందు, మే 22 (విజయక్రాంతి): జే కే ఓసీ విస్తరణ ప్రాజెక్టు లో వ్యవసాయ భూ ములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరా, పరిహారం చెల్లించాలని, ఓసీ తీసే ప్రాంతం మినహ మిగిలిన సింగరేణి క్వార్టర్స్ సొంత ఇండ్ల భూమిని రెవెన్యూ కు అప్పగించాలని అఖిలపక్షం నాయకులూ డిమాండ్ చేశారు. గురువారం అకిలపక్షం ఆధ్వర్యంలో తాసిల్దా ర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించా రు.
ఈ సందర్భంగా అకిలపక్ష నాయకుల మాట్లాడుతూ ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో త్రాగు నీరు, పారిశుధ్యం, రోడ్లు డ్రైనేజీ, ఇం దిరమ్మ ఇళ్లు సింగరేణి సంస్థ ద్వారానే చేపట్టాలన్నారు. ఓసీ ప్రభావిత ప్రాంతాల యు వతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఓసీ ప్ర భావిత ప్రాంత ప్రజల బాగోగులు పట్టించుకోకుంటే ఓసీ పనులు అడ్డుకుంటామని హె చ్చరించారు.
ఈ కార్యక్రమం లో సీపీఎం పా ర్టీ అబ్దుల్ నబి, అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జిల్లా నేత కె సారయ్య, సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నేత కే సారంగపాణి, కాంగ్రెస్ నేత ప్రముఖ న్యాయవాది సూరపాక సత్యనారాయణ, బిఆర్‌ఎస్ మాజీ వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, సీపీఎం తాళ్లూరి కృష్ణ, ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నేత రాం సింగ్ పాల్గొని మాట్లాడుతూ..
నిర్వాసితుల కు ప్యాకేజీ ఇవ్వాలని క్వార్టర్స్ లో నివసిస్తు న్న వారికే అప్పగించాలని ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి సంస్థ ద్వారానే త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ పనులువీధి దీపాలు, పా రిశుధ్య పనులు చేపట్టాలనిడిమాండ్ చేశా రు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కి ఇచ్చారు.
మాజీ ఎంపీటీసీ పూనెం సురేందర్, విజయ లక్ష్మి నగర్ మాజీ సర్పంచ్ పూనెం కవిత, తిలక్ న గర్ మాజీ సర్పంచ్ దనసరి వసంత, వెన్నంపల్లి శ్రీనివాస్, సీపీఐ గుళ్ల మొగిలి, టీడీపీ గుళ్ల సదయ్య, ఘాజీ, సదరం, మహేష్, బీఆర్‌ఎస్, రాసుద్దీన్, టీ లాలు సిపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, దనసరి రాజు, మాచర్ల విజ య్, పోతిరెడ్డి సారంగపాణి, బి హర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.