23-05-2025 05:22:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ డిపో పరిధిలో ప్రయాణికుల సూచనలు సమస్యల పరిష్కారం కోసం శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ సేవలు ఇతర అవసరాలపై ఏమైనా సమస్యలు సూచనలు ఉంటే 99592 26003 నంబర్ కు కాల్ చేసి సమస్య పరిష్కరించుకోవచ్చని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియం చేసుకోవాలని కోరారు.