23-05-2025 05:40:57 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు అంబలి పంపిణీ చేయడం అభినందనీయమని తహసీల్దార్ రామ్మోహన్ రావు అన్నారు. రెబ్బన మండల కేంద్రంలో ఇందిరానగర్ స్వయంభు మహంకాళి ఆలయ అర్చకుడు దేవర వినోద్ స్వామి ఆధ్వర్యంలో 33 రోజులుగా కొనసాగుతున్న అంబలి పంపిణీ కార్యక్రమంలో తహసిల్దార్ పాల్గొని ప్రజలకు అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.