23-05-2025 05:50:39 PM
ములుగు(మహబూబాబాద్),(విజయక్రాంతి): ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన 18 మంది మావోయిస్టు దళ సభ్యులు గత నెల 11న ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోగా, ఒక్కొక్కరికి రూ.25 వేలు పునరావాస పరిహారం పథకం కింద శుక్రవారం ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... భారతదేశంలో నక్సలైట్లకు అత్యుత్తమ సరెండర్ పాలసీ అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.
లొంగిపోయిన నక్సలైట్లకు వారిపై ఉన్న రివార్డు డబ్బులను వారికి త్వరలో అందజేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే అనారోగ్యకరమైన సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించి, క్షేమంగా జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన సహాయం అందిస్తామన్నారు. ఇప్పటికైనా అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.