23-05-2025 05:29:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): మంచిర్యాలలో మే 24 నుంచి 26 వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, బాల, బాలికల బాక్సింగ్ పోటీలకు నిర్మల్ జిల్లా నుండి పలు విభాగాలలో క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో అండర్-17 కేటగిరీలో నికిత (44-46), అక్షిత (46-48), కీర్తన (48-50), అభినయ (52-54), శ్రావణి (58-60) ఎంపిక చేశారు. బాలుర విభాగంలో అండర్-14 కేటగిరీలో దీక్షిత్ (40-42), కృషి రెడ్డి (42-44), శౌర్యన్ రెడ్డి (48-50), అలాగే అండర్-17లో అభిలాష్ (44-46) బరువులలో పాల్గొననున్నారని నిర్మల్ జిల్లా బాక్సింగ్ సెక్రటరీ, కోచ్ స్వామి తెలిపారు. జిల్లాను గర్వపెట్టేలా ఈ క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా క్రీడాధికారి శ్రీకాంత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్, బాక్సింగ్ సంఘ అధ్యక్షుడు శ్రీధర్, కార్యవర్గ సభ్యులు వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.