calender_icon.png 24 May, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం

23-05-2025 05:12:26 PM

జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం సందర్శించారు. సర్వే నెం. 816 లోని ప్రభుత్వ భూమిని ఎంపీడీవో కోటేశ్వర్, రెవెన్యూ అధికారులు ఆబెద్ అలీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో విద్యనభ్యసించేలా, ఆధునిక సదుపాయాలతో స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు. విద్యుత్, నీరు, ఆట స్థలాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రామీణ విద్యను మెరుగుపరచడం లక్ష్యంగా స్కూల్ నిర్మాణం చేపడతామని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకునేలా ఈ స్కూల్‌ను రూపొందించనున్నారు.