23-05-2025 05:16:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్ సంస్కార్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న శాలిగిరి శార్విన్ రెడ్డికి సైనిక్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 213 ర్యాంకు రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించినట్టు ప్రిన్సిపాల్ అయ్యగారు రచన, డైరెక్టర్ అయ్యగారు శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ర్యాంకు సాధించిన విద్యార్థిని పాఠశాలలో సన్మానం చేశారు ఇందులో భాగంగ సార్విన్ రెడ్డిని అభినందించబడినది.