23-05-2025 05:33:41 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ బస్టాండ్ నుంచి ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ సమీకృత భవనానికి ప్రతిరోజు బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్మల్ బస్టాండ్ నుంచి బయలుదేరి 10 20 నిమిషాల వరకు డిగ్రీ కాలేజ్ మీదుగా కలెక్టరేట్ మహాలక్ష్మి గుడి వరకు ఉంటుందని అన్నారు. సాయంత్రం ఐదు గంటలకు మహాలక్ష్మి ఆలయం నుండి కలెక్టరేట్ మీదుగా నిర్మల్ బస్టాండ్ కు బస్సు సదుపాయం ఉంటుందని ఈ అవకాశాన్ని ఉద్యోగులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ బస్సు కు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని ఇతరులకు 20 రూపాయల చార్జి ఉంటుందని ఆయన వివరించారు.