calender_icon.png 24 May, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యం కొనకపోతే ఆందోళనలు చేపడతాం

23-05-2025 05:26:23 PM

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులు పంట కళ్ళలో వేసుకున్న ధాన్యం తడిసిపోయినందున దాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దిల్వార్పూర్ మండలంలోని వార్ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి తడిసిన ధాన్యం రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం తీసుకువచ్చిన ధాన్యం సరైన సమయంలో భూకం వేయకపోవడం రూపం వేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించకపోవడం వలన రైతులకు నష్టం జరిగిందని ఇది ప్రభుత్వ వైఫల్యం కావడంతో రైతులకు న్యాయం చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు

పామాయిల్ గెలల కోత ప్రారంభించిన ఎమ్మెల్యే

నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండల కేంద్రంలో రైతులు సాగుచేసిన పామ్ ఆయిల్ రైతుల చేతికి రావడంతో కోతలను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. దిల్వార్పూర్ గ్రామానికి చెందిన రైతు వీరేష్ తోటలో ఫామ్ అయింది. ప్రారంభించి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.