23-05-2025 02:00:39 AM
పెద్దపల్లి మే 22 (విజయక్రాంతి) :పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మ ల్యాల కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనం తరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ను వేదమంత్రాలతో ఆశీర్వాదించారు.
ఈ కార్య క్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, దుగ్యల సంతోష్ రావు, సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక సతీష్, పోల్సని సునీల్ రావు, పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల నరేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భక్తులకు మజ్జిగ పంపిణీ ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జగిత్యాల మే 22 (విజయక్రాంతి): జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో గల ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గురువారం పెద్ద హనుమాన్ జ యంతి సదర్బంగా సర్గీయ పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి చేశారు. ఈ కార్యక్రమన్ని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం లాంఛనంగా ప్రారంభించారు. కాగా ఉత్సవాలకు విచ్చేసిన మాల ధరించిన హనుమాన్ స్వాములకు, భక్తులకు ట్రస్టు నిర్వాహకులు మజ్జిగ వితరణ చేశారు.