calender_icon.png 16 August, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరకాన్ని చూపిస్తున్న ప్రధాన రహదారి

16-08-2025 12:35:38 AM

అశ్వాపురం, ఆగస్టు 15 ,(విజయ క్రాంతి): ప్రధాన రహదారి నరకాన్ని తలపిస్తోంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబె క్కు మంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని అశ్వాపురం మండల రహదారి దుస్థితి.అశ్వాపురం మం డల ప్రజలు ప్రధాన రహదారిగా ఉన్న ఈ మార్గం ఇప్పుడు ప్రయాణికులకు కష్టసాధ్యమైన మార్గంగా మారింది. జాతీయ రహదా రుల విస్తరణలో భాగంగా కొన్ని నెలల క్రి తం పనులు ప్రారంభించినా, అవి మధ్యలో నే ఆగిపోయాయి.

రోడ్డు తవ్వి అలాగే వదిలేయడంతో గుంతలు పడటం వల్ల వర్షాలకు ముందు మట్టి, ధూళితో ప్రయాణాన్ని ప్ర మాదకరంగా మార్చేశాయి. నేడు వర్షాలతో గుంటలు నీటితో నిండి ప్రమాద భరితంగా మారాయి. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా, ప్రతి క్షణం ప్రమాదం పొంచి ఉందన్న భ యంతో వాహనదారులు వణికిపోతున్నా రు. పగటిపూట నీటి గుంతలతో, రాత్రిపూట వెలుతురు లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. రహదారి పక్కన ఎ టువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల అప్రమత్తంగా ఉన్నా వారికీ ప్రమాదం తప్పడం లేదు. చిన్న తప్పిదం కూడా ప్రాణాపాయాన్ని పొంచి ఉంది. .

ఈ పరిస్థితికి ఆర్ అండ్ బి శాఖ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం, కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపం అన్ని కలిపి రహ దారి పరిస్థితిని ఈ దుస్థితికి చేరింది. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చే స్తున్నప్పటికీ, ఆ పనులు ప్రజల కళ్లముందు కనిపించడం లేదని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకో వడం అనే భావిస్తూన్నారు. అత్యవసర పనులుంటే తప్ప ఈ మార్గాన్ని ఎంచుకోవడం లేదు.

 కొంతమంది అయితే గమ్యస్థానానికి దూరమైనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది రహదారి కాదు, గుంతల సముదాయం అని ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. తక్షణమే పనులు పూర్తి చేసి, రహదారి సురక్షితంగా మార్చాలని ప్రభుత్వాన్ని, సంబం ధిత శాఖలను మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రయాణం ప్రాణాంతక మైంది.. 

అశ్వాపురం రోడ్లపై ప్రయాణించడం ప్రాణాంతకంగా మారింది. రోడ్డుపైన పె ద్ద పెద్ద గోతులు పడటం, వర్షాకాలం కా వడం మూలాన గుంతల్లో నీరు నిలిచి ఎ క్కడ ఏ గోతిలో ఎంత లోతు ఉందో తెలియని పరిస్థితి. ప్రయాణాలు ప్రమా ద భరితంగా మారాయి. అధికారులు త్వరితగతిన మరమత్ పనులు పూర్తి చేయాలి. 

 గద్దల రామకృష్ణ (అశ్వాపురం) వర్షాభావం పరిస్థితుల కారణంగా ఆలస్యం... 

వర్షా బావ పరిస్థితి కారణంగా మరమత్తు పనుల్లో కొంత జాప్యం చోటుచే సుకోంది. చేసిన పనులకు బిల్లుల పెం డింగ్ లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులను వేగవంతం చేస్తాం.

 డి.ఈ సతీష్