calender_icon.png 29 August, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీ మేనన్‌కు ఊరట

29-08-2025 05:48:38 AM

ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కేరళ కోర్టు

తిరువనంతపురం, ఆగస్టు 28: మలయాళ నటి లక్ష్మీ మేనన్‌కు ఊరట లభించిం ది. ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో సదరు నటిని సెప్టెంబర్ 17 వరకూ అరెస్ట్ చేయొద్దంటూ కేరళ కోర్టు ముందస్తు బెయి ల్ మంజూరు చేసింది. లక్ష్మీ మేనన్ తన స్నేహితులతో కలిసి కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి.. అనంతరం దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పోలీసు లు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ‘ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశాం.

నిందితు ల్లో ఉన్న నటి పరారీలో ఉంది’ అని పోలీస్ కమిషనర్ విమాలాదిత్య తెలిపారు. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే లక్ష్మీ మేనన్ పేరును పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని సమాచారం. లక్ష్మీ మేనన్ తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు పొందారు. డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయకున్నా.. డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.