calender_icon.png 5 July, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌కుమార్‌కు ఊరట

25-03-2025 12:00:00 AM

అతడిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 24: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రైవేట్ చానెల్ ఎండీ శ్రవణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊర ట లభించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అతడి ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో శ్రవణ్ సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.

పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి బీవీ నాగరత్న అతడిపై చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశాలి చ్చారు. విచారణను ఏప్రిల్ 28కి వాయి దా వేశారు. బీఆర్‌ఎస్ గవర్నమెంట్ హ యాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్‌ఉమార్ నిందితుడిగా ఉన్నాడు.

ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు అతడిపై అభియోగాలున్నాయి. ప్రస్తు తం అతడు తప్పించుకొని అమెరికాకు వెళ్లాడు. శ్రవణ్‌కుమార్ తరఫు లాయర్ దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.