calender_icon.png 3 September, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిపై దాడికి పాల్పడ్డ నిందితుల రిమాండ్

22-09-2024 02:17:27 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతానికి చెందిన వేల్పుల శ్రావణ్ అనే వ్యక్తిపై గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో తల్వార్ దాడి చేసిన హనుమాన్ బస్తీకి చెందిన  రాస బత్తుల గణేష్, రామటెంకి శ్రీనివాస్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు వన్ టౌన్ సిఐ ఎన్. దేవయ్య తెలిపారు. రామ్ నగర్ కు చెందిన వేల్పుల శ్రావణ్, అతని స్నేహితులు హనుమాన్ బస్తీలో రాస బత్తుల గణేష్ వీధిలో తిరుగుతుండగా గొడవలు జరిగాయని చెప్పారు. ఈ గొడవలు మనసులో ఉంచుకున్న రౌడీ షీటర్ రాస బత్తుల గణేష్ అతని స్నేహితుడు రామటెంకి శ్రీనివాస్ అలియాస్ గూగుల్ శ్రీనివాస్ తో కలిసి నిమజ్జనం శోభాయాత్రలో శ్రావణ్ పై తల్వార్ తో దాడికి పాల్పడ్డారన్నారు. రౌడీ షీటర్లు చట్టాన్ని అతిక్రమించి నేరాలకు పాల్పడితే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దేవయ్య హెచ్చరించారు.