09-05-2025 01:33:15 AM
కరీంనగర్ క్రైం, మ8 (విజయ క్రాంతి): నగరంలోని పలు డివిజన్లలో మురుగునీటి కాలువలు గత కొంతకాలంగా సిల్ట్ తో పూర్తిగా నిండిపోయాయని, వెంటనే మురుగునీటి కాల్వల్లో సిల్ట్ తొలగించాలని 59వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గందె మాధవి కోరారు.
ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో సిల్ట్ ఉండడంతో వరదనీరు కిందికి పోవడానికి ఇబ్బందిగా మారుతుందని, కొన్ని ప్రాంతా ల్లో ఇళ్లలోకి నీరు చేరి పూర్తిగా జలమయమయ్యే పరిస్థితులు ఏర్పడుతాయని తెలి పారు. వెంటనే టెండర్లు పిలిచి సిల్ట్ ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.