calender_icon.png 9 May, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం

09-05-2025 01:32:24 AM

మహబూబాబాద్, మే 8 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ సంస్థ గత నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లాలో శ్రీకారం చుట్టారు. సంస్థ గత నిర్మాణం కోసం పిసిసి ఇద్దరు పరిశీలకులను ప్రత్యేకంగా నియమించింది. ఈ మేరకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పదవుల పందేరం కోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందుకోసం మండలాల వారిగా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

గురువారం డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో చిన్న గూడూరు, దంతాలపల్లిలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో నిర్వహించిన సమావేశాలకు ప్రభుత్వ విప్ , డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గ్రామస్థాయి నుంచి పటిష్టపరిచేందుకు చర్యలు ప్రారంభించారు.