calender_icon.png 25 December, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ పేరును తొలగించడం దేశచరిత్రను అవమానించడమే..

24-12-2025 12:03:30 AM

  1. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్

సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు

హుజూర్ నగర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరులోని జాతిపిత  మహా త్మా గాంధీ పేరును తొలగించడం దేశ చరిత్రను అవమానించడమేనని సిపిఐ జిల్లా కా ర్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్,సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అన్నా రు. మంగళవారం పట్టణ సిపిఐ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ పేరును తొలగించడా న్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపి మహా త్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలపై దాడి చేయడం పరిపాటిగా మారిందన్నారు.

గ్రామీణ పేదల హక్కులకి విఘాతం కలిగించేలా ఉపాధి హామీ పథకం మార్పులు చేయడం తగదన్నారు.దేశ ప్రజల పక్షాన పోరాడిన మహాత్ముడి పేరు తొలగించడం రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన మార్పులను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే ప్రజా ఉద్యమాలతో తగిన గుణపాఠం నేర్పుతామని తీవ్రంగా హెచ్చరించారు.

పేర్లు మార్పు చేసినంత మాత్రాన చరిత్రను సత్యాన్ని ప్రజల నుండి వేరు చేయలేరన్నారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరం మల్లేశ్వరి,దొంతగాని సత్య నారాయణ,జడ శ్రీనివాస్, మామిడి వెంకయ్య,సోమగాని కృష్ణ, కందుల వెంకటేశ్వర్లు,కొప్పోజు సూర్య నారాయణ,తదితరులు, పాల్గొన్నారు.

ఉపసంహరించుకోవాలి: సీపీఎం 

మఠంపల్లి, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : మండల పరిధిలోని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకువచ్చిన రాంజీ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులతో కలిసి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్,మండల కార్యదర్శి మాలోతుబాలు నాయక్ మాట్లాడుతూ మోడీ గ్రామీణ పేద ప్రజల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలకు నష్టం జరుగుతుందన్నారు.

ఈ పథకం పేదలకి ఉపయోగపడే పథకాన్ని రద్దు చేయటం బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్ కుట్రేనన్నారు. కొత్త చట్టం అమలు అయితే ఉపాధి హామీలో ఉన్న పథకాలు నిబంధనలు మార్గదర్శకాలు రద్దవుతా యన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి, డి. హర్యా పొడిచెట్టి రాము,నున్న గోకుల లక్ష్మమ్మ, మల్లీశ్వరి పాల్గొన్నారు.