19-07-2025 08:07:48 PM
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని చిన్నతరహా, పెద్దతరహా వ్యాపారస్థులు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ టి రమేష్(Municipal Commissioner T Ramesh) తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని వ్యాపార సంబంధిత షాపులకు ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్‌ను వెంటనే చెపించుకోవాలని కోరారు. ఇంతవరకు ట్రేడ్ లైసెన్స్ పొందని వారు లేదా లైసెన్స్ ఫీజు బకాయిలు చెల్లించనివారు ఫీజును వెంటనే మున్సిపాలిటీకి చెల్లించాలని పేర్కొన్నారు. రెన్యువల్, అందుకు సంబంధించిన ఫీజు చెల్లించని వ్యాపారులపై గరిష్ఠంగా రూ.5,000/- నుంచి రూ.10,000/- వరకు జరిమానా విధించబడుతుందనీ తెలిపారు. అవసరమైతే సంబంధిత షాప్‌పై 25 రెట్లు పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు వ్యాపారస్తులపై తెలంగాణ మునిసిపల్ చట్టం–2019 ప్రకారం తగిన శాసన చర్యలు తీసుకోబడతాయనీ మున్సిపల్ కమిషనర్ కన్నీరు రమేష్ ఆ ప్రకటనలో వివరించారు.