19-07-2025 08:09:53 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సన్నాయిల వెంకటేష్(32) గత కొన్ని సంవత్సరాలుగా బతుకుతెరువు కోసం హనుమకొండకు వెళ్లి ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ, అనూషతో వివాహమాడి, ఇద్దరు పిల్లలను సంతానం కలిగారు. విధి వక్రీకరించడంతో గడిచిన 5 రోజుల క్రితం వెంకటేష్ కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో వెంకటేష్ కుమార్తెలు ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samel) దగ్గరికి ఇరువురు రాగ, చిన్నపిల్లలను చూచి, చెల్లించి మానవత్వంతో, ఇరువురికి 50 వేల రూపాయలు ఆర్థిక సహకారం ప్రకటించారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు దీనితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.