17-07-2025 10:34:45 PM
మహబూబ్ నగర్ రూరల్: ప్రభుత్వ పనులు అంటే చాలు నాసిరకంగా చేసి బిల్లులు చేసుకుంటే సరిపోతుంది అనుకుంటుంటారు కాంట్రాక్టర్లు. ఇందుకు అధికారులు కూడా తక్యం కాదు వారు కూడా చూసి చూడనట్టు ఉండి బిల్లులు చేస్తున్నారని ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 4 లోని ఎదిరలో మోరిపై వేసిన పైకప్పు కుంగిపోవడంతో ప్రమాదం అంచున ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో అక్కడ ఉన్న కాలనీవాసులు రాకపోకల ప్రాంతంలో కల్వర్టు పగిలిపోవడంతో బండలు ఉంచారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. అప్పటివరకు వాహన చోదకులు కానీ, పాదాచారులు గాని కాస్త చూసి పోవాల్సిందే.