22-12-2025 12:27:11 AM
నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): స్థానిక సంస్థ ఎన్నికల్లో బిసి కులాల ప్రజలకు 42% రిజర్వేషన్లు పొందకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం చట్టం తేవడంలో నిర్లక్ష్యం వహించినప్పటికీని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50% స్థానాల్లో బీసీ కులాలు విజయం సాధించి మోడీ సర్కార్ కు గట్టి సవాల్ విసిరని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట అన్నారు. ఆదివారం అయినా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలో బిసి కులాల ప్రజలు రాజకీయ ప్రత్యర్ధులకు చెంపపెట్టులా పంచాయతీ ఎన్నికల తీర్పు పని చేశాయన్నారు..
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలకు గాను. 2,537 ఏజెన్సీ ప్రాంతాల గ్రామ పంచాయతీలు పోను, మిగిలిన 10,223 గ్రామ పంచాయతీల్లో 5,123 గ్రామ పంచాయతీలను బిసి కులాల అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అంటే 50% అన్నమాట. సోదర ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ స్థానాలకు ఎలాగో రిజర్వేషన్లు ఉన్నందున వారిలో ఎవరు గెలిచినా ఎస్సీ, ఎస్టీ సోదరులే సర్పంచ్ లుగా గెలుస్తారన్నారు. బీసీ లు ఎన్నికల్లో అవలంబించిన విధానాన్ని రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో బిసి కులాల ప్రజలు 60% మేరకు విజయం సాధిస్థారన్న నమ్మకం ఉందని దండి వెంకట్ తెలిపారు.
ప్రజాప్రతినిధులుగా విజయం సాధించిందడం ద్వారా భవిష్యత్తు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు బీసీలకు మార్గం సుగమంనం అవుతుందన్నారు. 50% గ్రామ పంచాయతీ సర్పంచ్ లలో ప్రధాన జనాభా కలిగిన బిసి ఎ కులాల నుండి బిసి బి కులాల నుండి బిసి డి కులాల నుండి కేటగిరీ వైజ్ గా ఏ కులాల ప్రజల నుండి ఎంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు అనేదే ముఖ్యమైన విషయంగా పరిగణించాలనీ ఆయన కోరారు. ఈ గెలుపుల ఈ గెలుపు శాతం లో ముఖ్యమైన విషయాన్ని పరిశీలించలిసిన బిసి కులాల నుండి మూడు నాలుగు కులాలు మాత్రమే అత్యధిక ప్రజాప్రతినిధులు గెలవడం ద్వారా సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఆశించలేమని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల్లో బిసి కులాల ప్రజాప్రతినిధులు గెలవడం ద్వారా ఏమిటి పంచాయతీలు, ఎంపిటిసి, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో బిసి కులాల ప్రజల నుండి ప్రజాప్రతినిధులు గెలవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్య కులాల ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఆధిపత్యం కూలిపోతుందన్నారు. తద్వారా నూతన ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తుల ఆవిర్భావం జరుగుతుందనీ దండి వెంకట్ తెలిపారు ఎ రాజకీయ పార్టీలు అయినా కావచ్చు స్థానిక ప్రభుత్వాలు 90% బిసి , ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల ఆధిపత్యంలోకి రావడం వల్ల అప్పుడు గ్రామీణ ప్రాంతాల నుండి కుల, వర్గ రాజకీయ పోరాట శక్తుల పునరేకీకరణ ఏర్పడుతుందనీ ధీమా వ్యక్తం చేశారు. ఈ పునరేకీకరణనే ఇండియా తరహా సామాజిక విప్లవానికి నాంది పలుకుతుందని తెలియజేస్తూ ఎన్నికల్లో విజయం సాధించిన బిసి, ఎస్సీ,ఎస్టీ మత మైనారిటీలు, ప్రజాస్వామ్య వాదులకు చెందిన విజేతలందరికీ దండి వెంకట్ అభినందనలు తెలిపారు.