22-12-2025 01:05:15 AM
నేడు కొలువుతీరనున్న కొత్త సర్పంచులు
సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం
జిల్లాలో బాధ్యతలు చేపట్టనున్న 422సర్పంచ్ లు, వార్డు సభ్యులు
రిజర్వేషన్ అభ్యర్థి లేకపోవడంతో శంకరాయపల్లి తండాలో జరగని ఎన్నిక
మహబూబ్ నగర్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రెండేళ్ల సుదీర్ఘ కాలానికి ముగింపు పలుకుతూ స్పెషల్ ఆఫీసర్ల పాలనకు చరమగీతం పాడుతూ పంచాయతీలలో పాలకవర్గం నేడు కొలువుతీరునున్నది. జనవరి 31 2024 సంవత్సరంలో సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ దాదాపు రెండేళ్ల కాలం పాటు తెలంగాణ ప్రభుత్వము సర్పంచ్ల ఎన్నిక అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీసిన విషయం విధితమే. ఈ తరుణంలో ఎట్టకేలకు జరిగిన మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 423 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్క గ్రామ పంచాయతీకి మినహా 42 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగడంతో పాటు సర్పంచులు ఎన్నిక కావడం జరిగింది.
జడ్చర్ల నియోజకవర్గం లోని శంకరయ్య పల్లి తండా లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆ పంచాయతీలో ఎన్నిక లకు సంబంధించి నామినేషన్ రాకపోవడంతో పాటు 6 వార్డు మెంబర్ సభ్యులకు కూడా నామినేషన్ దాఖలు కాలేదు. చిట్టి బోయిన్పల్లి లో కూడా ఒక వార్డు మెంబర్ కు సంబంధించి ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేకపోవడంతో ఆ ఎన్నిక ప్రక్రియ జరగలేదు. మొత్తం ఒక సర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యులకు ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 మంది సర్పంచులు, 3667 మంది వార్డు సభ్యులు కొలువు తీరనున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం..
సర్పంచులను గ్రామపంచాయతీలో కూర్చోబెట్టినందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన సూచనలు సలహాలు చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే గ్రామ పంచాయతీలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారానికి సన్నద్ధమవుతుండ్రు.
కట్టుబడి ఉంటేనే.. మంచి భవిష్యత్తు..
రాష్ట్రంలోనే కాదు దేశంలోని కూడా పెద్ద నేతలు సైతం ముందుగా వార్డు సభ్యులు ఆ తర్వాత సర్పంచులు ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానాలకు చేరిన వారు ఎందరో ఉన్నారు. సర్పంచులుగా బాధ్యతలు చేపడుతున్న వారు కొత్తవారితో పాటు వాతావరణ ప్రజలు మొగ్గు చూపి గెలిపించారు. ఎన్నో వాగ్దానాలు చేసిన సర్పంచ్ అభ్యర్థులు ఏ గ్రామానికి ఆ గ్రామంలో ని సమస్యలను ప్రజలకు వివరిస్తూ వాటిని పరిష్కరించే దిశగా తీసుకుపోతామని తెలియజేస్తూ గెలుపు తీరాలకు చేరుకున్నారు.
ఆ హామీలను పక్కనపెట్టి సొంత ఎజెండాలతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఎన్నుకున్న జనం చేతనే చివాట్లు తినవలసిన పరిస్థితులు కూడా లేకపోలేదు. చెప్పిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి గ్రామ సమగ్ర అభివృద్ధి చేస్తూ ముందుకు సాగితే గెలిచిన సర్పంచ్లలో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించే రోజులు కూడా వారి సొంతం అయ్యే అవకాశాలు మెడ్ గా ఉంటాయి. ప్రజల గుండెల్లో పదిలంగా ఉండేలా పనిచేస్తారా? ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తారా? ఎటువైపు నూతన సర్పంచుల అడుగులు ఉంటాయో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.