calender_icon.png 22 July, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌టీపీసీ అండర్ పాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని వినతి

22-07-2025 12:02:46 AM

ఘట్ కేసర్, జూలై 21 : పోచారం మున్సిపల్ లోని వరంగల్-హైదరాబాద్ జాతీయ ర హదారి మార్గంలో అన్నోజిగూడ ఎన్ టి పి సి చౌరస్తా వద్ద నిర్మించనున్న అండర్ పాస్ రోడ్డు నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలని కోరుతూ సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి జాతీయ రహదారుల రీజనల్ డైరెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈజాతీయ రహదారి గుండా  అనునిత్యం కళాశాలలకు విద్యార్థులు, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనం కొరకు వేలాది వాహనాల ద్వారా భక్తజనులు ప్రయాణిస్తూ ఉన్న క్రమంలో అనేక ప్రమాదాలకు కారణంగా మారిందని, ఈప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం కొరకు టెండర్ ప్రక్రియలో చాలా ఆలస్యం జరుగుతుందని, లక్షలాది ప్ర జలకు ఉపయోగకరంగా ఉండే ఈఅండర్ పాస్ ను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ జాతీయ రహదారుల రీజనల్ డైరెక్టర్ కు అందజేసిన వినతి పత్రంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.