20-09-2025 12:00:00 AM
అమీన్‌పూర్, సెప్టెంబర్ 19 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో గల సిద్ధార్థ కాలనీ రోడ్డు సమస్యతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ఎమ్మెల్సీ అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన అంజి రెడ్డి అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డికి కాల్ చేసి కాలనీలలో గల సమస్యలపై వెంటనే పరిశీలన చేయాలని ఆదేశించారు.
అలాగే చెరువు కట్ట వైపు రోడ్డుకు పరిష్కారం చూపిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈర్ల రాజు మాట్లాడుతూ సమస్య లపై వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కమిషనర్ జ్యోతి రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం పటేల్ గూడలోని కాలనీలలో ఎలాంటి సమస్య ఉన్న ముందుండి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కాలనీ నాయకులు రాజేష్, షణ్ముఖ, రెయిన్బో మెడోస్ కాలనీ నాయకులు కృష్ణ పాల్గొన్నారు.